తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా

  • న్యుమోనియాతో బాధపడుతున్న నసీరుద్దీన్ షా
  • చికిత్సకు బాగా స్పందిస్తున్నారన్న ఆయన మేనేజర్
  • ప్రస్తుతం ఆయన బాగున్నారన్న భార్య రత్న
బాలీవుడ్ నటులు వరుసగా ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే సీనియర్ నటుడు దిలీప్ కుమార్ శ్వాస సమస్యలతో ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కూడా ఆసుపత్రిలో చేరారు. 70 ఏళ్ల నసీరుద్దీన్ న్యుమోనియాతో బాధపడుతున్నారు. చికిత్సకు నసీరుద్దీన్ బాగా స్పందిస్తున్నారని ఆయన మేనేజర్ తెలిపారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ షా భార్య రత్న పాథక్ మాట్లాడుతూ, గత రెండు రోజులుగా న్యుమోనియాతో ఆయన బాధపడుతున్నారని చెప్పారు.

నిన్ననే ఆయనను ఆసుపత్రిలో చేర్పించామని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా ఆయన బాధ పడుతున్నారని చెప్పారు. మరోవైపు బాలీవుడ్ నటి మందిరా బేడీ భర్త ఈ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారు.

naseeruddin shah
Bollywood

More Telugu News